ఇప్పుడు బాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్‌కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. షేర్‌షా మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ గురించి స్పెషల్‌గా మాట్లాడుకున్నారు. ఒకరితో ఒకరు ప్రేమలో లేకపోతే, స్క్రీన్ మీద ఎమోషన్స్ అలా పండవని అన్నారు ట్రేడ్ పండిట్స్. అలాంటివారందరి మాటలనూ నిజం చేస్తూ ఒకింటివారయ్యారు సిద్ - కియారా.
వీరిద్దరికీ ఫిబ్రవరిలో వివాహం జరిగింది. రాజస్థాన్‌లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత రెండు అవార్డులను అందుకున్నారు సిద్ధార్థ్ మల్హోత్రా. ఈ అవార్డుల గురించి స్పెషల్‌గా మెన్షన్ చేశారు. వాటిలో ఒకటి నటుడిగా అందుకున్నదైతే, మరొకటి స్టైలిష్ విభాగంలో అందుకున్నది. తనను స్క్రీన్ మీద అంత అందంగా చూపించడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు సిద్ధార్థ్ మల్హోత్రా. ``పెళ్లయిన తర్వాత నేను అందుకుంటున్న సెకండ్ అవార్డు ఇది. ఒకటి నేను మంచి నటుడిని అని ఇచ్చారు. మరొకటి నా లుక్స్ కి ఇచ్చారు. వీటిని నేను నా భార్యకు అంకితం చేస్తున్నాను. తను మంచి నటి మాత్రమే కాదు. చాలా మంది స్టైలిష్ పర్సన్. తన స్టైలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను స్టైలిష్ గా కనిపించడం వెనుక తన ఆసక్తి కూడా ఉంటుంది. నా కోసం అందమైన డ్రస్సులు డిజైన్ చేస్తున్న డిజైనర్లకు కూడా ధన్యవాదాలు. వాళ్ల వల్లనే నేను ఇంత కూల్‌గా కనిపిస్తున్నాను`` అని అన్నారు సిద్ధార్థ్ మల్హోత్రా.
అతను ఈ మాటలన్నీ చెప్పిన వీడియో షేర్ చేశారు కియారా అద్వానీ. ఈ మనిషి నా మనసు మొత్తం నిండిపోయాడు అంటూ తనదైన శైలిలో ప్రేమను వ్యక్తం చేశారు మిసెస్ కియారా అద్వానీ మల్హోత్రా. ఈ ఏడాది వెబ్ ఫిల్మ్ మిషన్ మజ్నుతో స్క్రీన్ మీదకు వచ్చారు సిద్ధార్థ్ మల్హోత్రా. ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సీరీస్‌లోనూ నటిస్తున్నారు. యోధ అనే మరో సినిమా చేతిలో ఉంది. కియారా ప్రస్తుతం సత్య ప్రేమ్‌కీ కథ సినిమాలో కార్తిక్ ఆర్యన్ సరసన నటిస్తున్నారు. దక్షిణాదిన శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ సరసన నటిస్తున్నారు. రామ్‌చరణ్ తో నటించిన వినయ విధేయ రామా మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు కియారా అద్వానీ.